ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చెడ్డి గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై చిన్న రెడ్డప్ప

చెడ్డి గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై చిన్న రెడ్డప్ప

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 29 గరుడ దాత్రి న్యూస్

చెడ్డి గ్యాంగ్ కదలికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌడేపల్లి ఎస్సై చిన్నారెడ్డప్ప విజ్ఞప్తి చేశారు బుధవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడారు . సమావేశంలో పీలేరు పరిసరాల పరిధిలో చెడ్డి గ్యాంగ్ కదలికలకు సంబంధించి సమాచారం అందిందని తెలిపారు. అందిన సమాచారంతో పోలీసులు చౌడేపల్లి పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. మండల పరిధిలో కానీ లేదా ఇంటి పరిసరాలలో అనుమానాస్పదముగాసంచరించే వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వారి కదలికలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ప్రధానంగా పట్టణ శివార్లు, బస్టాండ్, ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈనేపథ్యంలో స్థానిక శాఖ మరింత అప్రమత్తంగా కనురెప్పవాల్చకుండా విస్తృతంగా గస్తీకాయడం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలను అడ్డుకునే భాగంలో జిల్లాలో రాత్రి సమయాల్లో గస్తీ మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక సిబ్బంది ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఏమాత్రం సందేహాస్పద సమాచారం ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!