ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పంట భీమా కు చివరి రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మనవి

పంట భీమా కు చివరి రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మనవి

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారిణి
గీతకుమారి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29

రైతు వాతావరణ ఆధారిత పంట బీమా పథకం సంబంధించిన రుణగ్రహీత మరియు రుణం తీసుకోని రైతుల నమోదు చివరి తేదీని 24 జూలై 2026 నుండి 31 జూలై 2026 వరకు పొడిగించడం జరిగింది.

NCIP పోర్టల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అర్హత కలిగిన రైతులు 31 జూలై 2026 వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ నమోదు పూర్తి
చేసుకోవాలని సూచించబడుతున్నారు. ఇకపై ఎటువంటి గడువు పొడిగింపు ఇవ్వబడదు.

ఈ పొడిగించిన గడువులో నమోదు చేసుకున్న రైతులకు 01 ఆగస్టు 2026 నుండి బీమా రిస్క్ కవరేజీ అమల్లోకి వస్తుందిఅని మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి పేర్కొన్నారు.
అన్ని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఈ సమాచారాన్ని విస్తృతంగా రైతులకు చేరవేసి, అర్హులైన రైతులు 31 జూలై 2026లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, రైతు శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనల ద్వారా విస్తృత ప్రచారం చేయవలసిందిగా ఆమె కోరారు .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!