ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డీకే పల్లి రైల్వే వంతెన సమస్యను పరిష్కరించాలి

డీకే పల్లి రైల్వే వంతెన సమస్యను పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డి. రమేష్ బాబు
కుప్పం జులై 29 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పట్టణ సమీపంలోని డీకే పల్లి రైల్వే వంతెన కింద వర్షపు నీరు నిలిచిపోతూ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డి. రమేష్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆవుల గోపి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.వంతెన కింద కొద్దిపాటి వర్షం కురిసినా మూడు నుంచి నాలుగు అడుగుల మేర భారీగా నీరు నిలిచిపోతుందని, నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పలుమార్లు పాలకులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు  డి. రమేష్ బాబు మాట్లాడుతూ, డీకే పల్లి రైల్వే వంతెన కింద నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ మార్గం కుప్పం మండలంలోని అనేక గ్రామ పంచాయతీలకు వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో పాటు, పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లే మార్గంగా కూడా ఉందని నాయకులు తెలిపారు. నీరు నిలిచిపోవడంతో వెయ్యి మందికి పైగా విద్యార్థులు, విద్యార్థినులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తరచూ వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రజలు గాయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంతటి తీవ్ర సమస్య ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వంతెన కింద వర్షపు నీరు నిల్వ ఉండకుండా, నీరు సులభంగా బయటకు వెళ్లేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు.ఈ పరిశీలన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డి. రమేష్ బాబు, కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆవుల గోపి,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు కేశవరాజు, ప్రకాష్, రోహినప్ప, నిజాం, ముని రామయ్య ,ఎం గౌహర్ ,ఎస్ కే హాయిం ,ఎస్సీ సెల్ అధ్యక్షులు సుందర మూర్తి, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇర్ఫాన్, సుబ్రమణి, కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి మునస్వామి, రామకుప్పం మండల అధ్యక్షులు సుబ్రమణి, శాంతిపురం మండల అధ్యక్షులు నంజప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!