ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గురు పౌర్ణమి సందర్భంగా నాగాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా నాగాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూలై 29:
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు టీచర్స్ కాలనీలోని స్థానిక శ్రీ నాగాలమ్మ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ పూజారులు బాలు స్వామి మరియు కల్పనమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు పాల బిందెలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పూజారమ్మ కల్పనమ్మ నాగాలమ్మ అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!