వేపూరు గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
కుప్పం,జులై 29(గరుడ ధాత్రి న్యూస్):తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని బలం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం కుప్పం రూరల్ మండలం వేపూరు గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తిన జెండా దించకుండా పని చేస్తారన్నారు.
టీడీపీ కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే మహిళలు బయటకొచ్చి నిరసన తెలిపారు. నేను నిజం గెలవాలి యాత్ర చేసినప్పుడు కార్యకర్తలు నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపారని గుర్తు చేశారు.కార్యకర్తలకు ప్రమాద బీమా తీసుకొచ్చిన ఘనత లోకేష్‌దేఅన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖాళీ చేశారని ఆరోపించారు.
అయినా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు.అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు.వేపూరు పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు, 15 గోకులం షెడ్లు నిర్మించడంతో పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 150 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు.
ఎన్టీఆర్ సుజల కింద వాటర్ ట్యాంక్‌లు , జడ్పీ స్కూల్లో భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గ్రామంలో 700 మందికి తల్లికి వందనం, 527 మందికి పింఛను అందుతోందన్నారు. రాముల వారి ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు చేశారు.కూటమి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుప్పం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని బలం
RELATED ARTICLES
