ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సీఎం సతీమణి నారా భువనేశ్వరి ని కలిసిన టిడిపి నేతలు

సీఎం సతీమణి నారా భువనేశ్వరి ని కలిసిన టిడిపి నేతలు

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్):

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ని తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు కలిశారు. కుప్పం నియోజకవర్గం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరిని టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్, రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, శాంతిపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్ నాయుడు, గుడిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి, రామకుప్పం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ నారా భువనేశ్వరిని కలిశారు. కుప్పం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, కుప్పం నియోజకవర్గ మైనార్టీ నాయకులు జాకీర్ భాష, మాజీ ఎంపీటీసీ ఉమాపతి, క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్ తదితరులు సీఎం సతీమణిని మర్యాదపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!