ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పలమనేరులో సన్నబియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

పలమనేరులో సన్నబియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

పలమనేరు,ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు పట్టణంలోని బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్‌లో తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ ఇన్భనాధన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ…సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే రూ.10 తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ లోకేశ్ వర్మ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పంపిణీ వర్తిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.52 చొప్పున, అలాగే రా-బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50 లకే సబ్సిడీ ధరపై విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి. బాలాజీ,టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు, గిరిబాబు, సురేష్, ఖాజా, సుధాకర్,దీపికా కృష్ణమూర్తి,బ్రహ్మయ్య, నాగరాజ, డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, విజయ్ శేఖర్, రెడ్డప్ప, మాబాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!