*ఎమ్మెల్యే అమర్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చేతుల మీదుగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్ల అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ (IPHL) ల్యాబరేటరీ ప్రారంభం
పలమనేరు, సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి ) :
పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీని వారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలను అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో వైద్య పరీక్షలు, చికిత్స అందేలా ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆరోగ్య రంగంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో కూడా పలమనేరు ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. అత్యాధునిక క్రిటికల్ కేర్ ల్యాబరేటరీ అందుబాటులోకి రావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్వో శశిభూషణ్, అడిషనల్ డీఎం అండ్ హెచ్వో వెంకట ప్రసాద్ డి సి హెచ్ ఎస్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెంండెంట్ మమతారాణి, ఆసుపత్రి కమిటీ సభ్యులు నాగరాజు, సుధాకర్ మరియు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక క్రిటికల్ కేర్ ల్యాబ్ ప్రారంభం. బైరెడ్డిపల్లి, రాయలపేట పీహెచ్సీలను అనుసంధానిస్తూ గ్రామ స్థాయి నుంచే మెరుగైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, హెల్త్ మానిటరింగ్ అందించేలా చర్యలు.
