ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయ లోక్ అదాలత్ నందు 510 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ నందు 510 కేసులు పరిష్కారం

📰 Generate e-Paper Clip

!)సీనియర్ సివిల్ న్యాయమూర్తి వావిలి ఆదినారాయణ.

పలమనేరు, సెప్టెంబర్ 12 ( గరుడ ధాత్రి ) :

దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ లోక్ ఆదాలత్ అన్నది కక్షిదారులకు మంచి సువర్ణ అవకాశమని సీనియర్ సివిల్ జడ్జి వావిలి ఆదినారాయణ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు ఇద్దరు పార్టీలు సమానంగా గెలుపొందినట్లుగా అవార్డును పొందవచ్చన్నారు. ఈ యొక్క అవార్డు కాపీలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో సమానమని తెలిపారు. కావున ఇరువర్గ పార్టీలు రాజమార్గమే రాజీమార్గంగా ఎన్నుకొని కోర్టు నందు పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు మొత్తం 510 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు.ఇందులో సివిల్ కేసులు 08, క్రిమినల్ కేసులు 497 మరియు బ్యాంక్ రికవరీ కేసులు 05 గా ఉన్నాయన్నారు.ఇలా కేసుల రికవరీ మొత్తం రూపాయలు 55 లక్షల 64 వేల 557 రూపాయలుగా తెలిపారు.ఈ సమావేశంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి యం.లిఖిత, సెకండ్ క్లాస్ మిజిస్ట్రేట్ సునీల్ రెడ్డి,అడ్వకేట్స్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. ఇర్షాద్ అలీ ఖాన్ , సీనియర్ న్యాయవాదులు లక్ష్మీపతి, పరమశివప్ప, రాజారెడ్డి, ఆరిఫుల్లఖాన్, కృష్ణమూర్తి, రెడ్డప్ప సెట్టి , సయ్యద్ మొహిదీన్, యల్.భాస్కర్, ఆంజనేయులు మరియు బ్యాంకు , పోలీస్ ఆఫీసర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!