ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యా సేవతో పాటు విశ్రాంత ఉద్యోగులకు సేవలు – జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

విద్యా సేవతో పాటు విశ్రాంత ఉద్యోగులకు సేవలు – జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటినగరం: జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లె ప్రధానోపాధ్యాయులు శ్రీ బి. చెంగల్ రాజును కార్వేటినగరం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
సెప్టెంబర్ 5న నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీ బి. చెంగల్ రాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కార్వేటినగరం విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున శ్రీ అరుణాచలం రెడ్డి, విజయకుమార్ పిళ్ళై రామ్మూర్తి రాజు, ఆర్ముగం తదితరులు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యాశాఖలో విశిష్ట సేవలు అందించడంతో పాటు ప్రతి సంవత్సరం విశ్రాంత ఉద్యోగులకు ద్వారా ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు సహకరిస్తూ, ఉద్యోగ బాధ్యతలకు మించి సమాజ సేవకు సమయాన్ని కేటాయిస్తున్న శ్రీ చెంగల్ రాజు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీమతి సుప్రసన్న, వేణుగోపాల్. రవి,కన్నయ్య తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!