ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేషనల్ లోక్ అదాలత్‌లో రూ.కోటి రోడ్డు ప్రమాద పరిహారం కేసు పరిష్కారం

నేషనల్ లోక్ అదాలత్‌లో రూ.కోటి రోడ్డు ప్రమాద పరిహారం కేసు పరిష్కారం

📰 Generate e-Paper Clip

నాగలాపురం సెప్టెంబర్ 12 గరుడధాత్రి :
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగలాపురానికి చెందిన దిల్లీబాబు కుటుంబానికి రూ.కోటి పరిహారం అందేలా నేషనల్ లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైంది. వినోబానగర్‌కు చెందిన దిల్లీబాబు 2025 మే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఆయన భార్య లావణ్య, ముగ్గురు కుమార్తెలు, తల్లి కలిసి న్యాయవాది చెరుకూరి హేమంతరావును ఆశ్రయించారు.
2025 నవంబర్ 12న చెన్నై హైకోర్టు ఆవరణలోని మోటార్ వాహన ప్రమాదాల పరిహార ట్రిబ్యునల్‌లో క్లెయిమ్ పిటిషన్ దాఖలైంది. బీమా సంస్థ లిబర్టీ ఇన్సూరెన్స్‌తో జరిగిన చర్చల అనంతరం కేసు నేషనల్ లోక్ అదాలత్‌లో రూ.కోటికి రాజీ కుదిరింది. కేసు దాఖలు చేసిన 10 నెలల్లోనే పరిష్కారం కావడంతో బాధిత కుటుంబానికి త్వరగా ఉపశమనం లభించింది.
గతంలో 2017లో జరిగిన యర్పేడు రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 16 మంది గాయపడిన ఘటనలోనూ బాధితులకు పరిహారం అందించడంలో న్యాయవాది చెరుకూరి హేమంతరావు సహకరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!