ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

📰 Generate e-Paper Clip

* భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి శ్రేణులు.
కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక బైపాస్ రోడ్ లోని టిడిపి కార్యాలయంలో సోమవారం వినాయక చవితిని పండుగను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యులు ఎస్ రాజ్ కుమార్, అర్బన్ టిడిపి అధ్యక్షులు వెంకటేష్, చంద్రబాబు కార్యదర్శి మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి సుధీర్, టిడిపి ప్రధాన నాయకులు డాక్టర్ వి. వెంకటేష్, సురేష్ బాబు, కే కన్నన్, అప్పు, దామోదరం నాయుడు, జాకీర్, ఉమాపతి నాయుడు, బుజ్జి, సురేష్, కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్ చలపతి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!