ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరిక్షలు

రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరిక్షలు

📰 Generate e-Paper Clip

: కార్వేటినగరం సెప్టెంబర్ 18 గరుడదాద్రి న్యూస్
రాష్ట్రీయ సేవ సమితి (రాస్) మహిళా పొదుపు సంఘాల సభ్యుల సౌకర్యార్ధం రాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటరత్నం గారు మరియు డైరెక్టర్ శ్రీ నాగరాజు గారు ఆదేశాలనుసారం నేడు కార్వేటి నగరం క్లస్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించడం జరిగింది. టాటా ట్రస్ట్ హాస్పిటల్ , తిరుపతి వారి (శ్రీకర్) ఆధ్వర్యంలో బి.పి, షుగర్, హైపటైటీస్, నోరు రొమ్ము, గర్భ సంచి వంటి ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించినారు , అంతకుముందు కాన్సర్ పట్ల మహిళలకు అవగాహన కల్పించినారు,
ఈ కార్యక్రమంలో డాక్టర్. వెంకయ్యబాబు గారు మాట్లాడుతూ “రాస్ సేవలు గర్వించదగినది అని , వైద్య పరిక్షలు, కంటి ఆపరేషన్ , వృతి శిక్షణలు , సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటివి తరుచు నిర్వహిస్తునారని కొనియాడారు. మహిళకు ప్రత్యేకించి ఎన్నో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుండడం దీని గమనించి రాస్ సంస్థ వారు ప్రతి నెలకు ఒకసారి ఉచిత వైద్య కార్యక్రమాలు కార్వేటినగరం పరిసర ప్రాంతాలలో నిర్వహించడం సంతోషకరం అని తెలియజేశారు.మనకు ఎంతగానో ఉపయోగపడుతున్న రాస్ సంఘాలు సభ్యులు కు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకి కూడా ఉపయోగపడడం చాలా ఆనందించదగ్గ విషయం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సుమారు 100మంది మహిళలు పురుషులు పరిక్షలు నిర్వహించుకునారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్. వెంకయ్యబాబు, రెడ్డికుమారి, మెహతాజ్, పుత్తూరు బ్రాంచ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ మరియు రాస్ సిబ్బంది బాలకృష్ణ , భారతి , స్వాతి, శరవణ సభ్యులు, లీడర్లు పాల్గొనారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!