ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లద్దిగం చేపల చెరువు బహిరంగ వేలం పాడుకున్న ముజామిల్ సాహెబ్

లద్దిగం చేపల చెరువు బహిరంగ వేలం పాడుకున్న ముజామిల్ సాహెబ్

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 18 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం లద్దిగం చేపల చెరువు బహిరంగ వేలం పాటను నిర్వహించారు.
1436 ఫసలీకి గాను సర్కారు పాటను రూ 70వేలుగా నిర్ణయిస్తూ మదనపల్లె డివిజనల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు మదనపల్లె డివిజనల్ పంచాయతీ అధికారి, లద్దిగం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ (చౌడేపల్లి డిప్యూటీ ఎంపీడీవో), పంచాయతీ కార్యదర్శి, లద్దిగం చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు, స్థానిక నాయకులు ప్రజల సమక్షంలో వేలం పాట సాగిందని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ తెలిపారు
ఈ బహిరంగ వేలంలో తీవ్ర పోటీ నెలకొనగా, లద్దిగం గ్రామానికి చెందిన ముజామిల్ సాహెబ్ రూ. 2,91 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి అత్యధిక పాటదారునిగా నిలిచారన్నారు .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!