ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వృత్తి విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన

వృత్తి విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 19 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటినగరం: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో వృత్తి విద్యా బోధనలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు తెలిపారు.పాఠశాలలో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సులకు చెందిన 50 మంది పదో తరగతి విద్యార్థులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. ట్రేడ్‌కు చెందిన 25 మంది విద్యార్థులను వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో కార్వేటినగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు తీసుకువెళ్లారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్ మరియు అధ్యాపకులు విద్యార్థులకు వివిధ ట్రేడ్లు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లను పరిచయం చేసి, వివిధ వృత్తి విద్యా కోర్సులు, వాటి ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రయోగశాలల్లోని పరికరాలను పరిశీలించి, వాటి పనితీరుపై సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా బి ఫ్ ఎస్ ఐ ట్రేడ్‌కు చెందిన 25 మంది విద్యార్థులను వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్ సంస్థకు తీసుకువెళ్లారు. సంస్థ బ్రాంచ్ మేనేజర్ విద్యార్థులకు మైక్రోఫైనాన్స్ ద్వారా రుణాల అందజేత, ఇన్సూరెన్స్, స్కోర్, రుణ ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. విద్యార్థులు కార్యాలయంలోని దరఖాస్తులు, రికార్డులను పరిశీలించి, సంస్థ కార్యకలాపాలపై అవగాహన పొందారు. తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ, వృత్తి విద్య ద్వారా �

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!