ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో అర్ధరాత్రి చంద్రబాబు కార్యదర్శి ఆఖస్మిక పరిశీలనలు

కుప్పంలో అర్ధరాత్రి చంద్రబాబు కార్యదర్శి ఆఖస్మిక పరిశీలనలు

📰 Generate e-Paper Clip

* పారిశుద్ధ్య పనుల పరిశీలన, సిబ్బందితో మాటామంతి.
* మార్కెట్ సందర్శన.
* రైతుల, సిబ్బంది సమస్యల వాకబు.
కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కార్యదర్శి శ్రీకాంత్ కుప్పంలో అర్ధరాత్రి పరిశీలనా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి శనివారం ఉదయం వేళ ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు,కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుప్పం పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఆకస్మికంగా అక్కడికి చేరుకుని, వారిని ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకున్నారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కుప్పం బైపాస్ రోడ్ లో దినసరి మార్కెట్ ను ఆయన సందర్శించారు. మార్కెట్లో రైతులకు అందుకున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రైతులు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!