అలరించిన వాయిద్య బృందాలు దేవతామూర్తుల వేషధారులు
కాణిపాకం సెప్టెంబర్ 21(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకంలో కన్నుల పండుగగా అత్యంత వైభవంగా రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉభయ దారుల ఆధ్వర్యంలోదేవతామూర్తులకుపూజలునిర్వహించారుమధ్యాహ్నం ఉభయ దారులు వాయిద్య బృందాలు నడుమ స్వామివారికి పూజలు నిర్వహించి రథాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి స్వామివారిని రథం పైకి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఈవో పెంచల కిషోర్. పాలకమండలి చైర్మన్ మనీ నాయుడు ఉపాయదారుల పూజలునిర్వహించి రథాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. హైదరాబాద్ ఎన్ జి గ్యాటర్ ఈవెంట్ మేనేజర్ గుప్తా ఆధ్వర్యంలో
కేరళ వాయిద్యం,దేవత వేషధారణలు,వినాయక స్వామి. అయ్యప్ప స్వామి. శివుడు. శ్రీకృష్ణుడు. కుమార్ స్వామి. బ్యాండ్ సెట్. కోలాటాలు. భజనలు. వాయిద్యబృందాలునడుమ కాణిపాకం పురవీధుల్లో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు రధంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు, స్వామివారికి అడుగడుగునాభక్తులు పూజలు చేశారు యువకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బోలో గణేష్ మహరాజ్ కి అంటూ రథాన్నిలాగారు. ఈవో పెంచల కిషోర్యువభక్తులను ఉత్సాహపరుస్తూ వారితో కలసిరథోత్సవంపూర్తయ్యేవరకురథోత్సవంలోపాల్గొన్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చిత్తూరు డిఎస్పి వెంకటనారాయణ. ఫైర్ ఇంజన్ అధికారులు దేవస్థానం సిబ్బందితో కలిసి ఏర్పాటు చేశారు. ఉభయదారులుగా మీనా కుమారి. మాజీ వి ఎం. పూర్ణచంద్రారెడ్డి. హరి ప్రసాద్ రెడ్డి కాణిపాకం ఉభయ దారులుగా వ్యవహరించారు.అ
ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు, నాగరాజు నాయుడు. చంద్రశేఖర్ రెడ్డి. శివప్రసాద్.అనసూయమ్మ. వసంత. శ్రీవాణి. కృష్ణవేణి. రాజ్యలక్ష్మి. కత్తి సుధాకర్ రెడ్డి. చంద్రకళ. సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. ఏ ఈ ఓ లు రవీంద్రబాబు. కృష్ణారెడ్డి. ధనపాల్. టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు. రవి. ఆలయ సిబ్బంది అర్చకులు వేద పండితులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
