ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటిటిడి కళ్యాణోత్సవానికి వేలాదిమంది రాక

టిటిడి కళ్యాణోత్సవానికి వేలాదిమంది రాక

📰 Generate e-Paper Clip

కుప్పం, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని బేటరాయ స్వామి కొండ వద్ద శనివారం టిటిడి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెరటాసి నెల మూడవ శనివారం కావడంతో మూడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ కార్యక్రమంలో పదివేల కు పైబడి భక్తాదులు పాల్గొన్నారు. భక్తాదుల అందరికీ టిటిడి ఆధ్వర్యంలో కంకణాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టిటిడి పాలక మండలి సభ్యులు శాంతారామ్, ఉడా చైర్మన్ సురేష్ బాబు లు ప్రసంగించారు. టిటిడి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పేరటాసి నెల మూడవ శనివారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!