నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు పట్టణంలో పలుచోట్ల చెత్త సమస్య తీవ్రంగా మారింది. అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు. దీంతో కాలుష్యం పెరిగి, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయితీ పారిశుధ్య కార్మికుల పనితీరును పర్యవేక్షించే మేస్త్రి పనితీరు అధ్వానంగా ఉందని స్థానికులు వాపోతున్నారు ఆయన ఎక్కడుంటారు? ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియడం లేదు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులు వీధుల బాట పట్టిన దాఖలాలు కనిపించలేదు దాంతో స్థానికులు కూడా ఎక్కడబడితే అక్కడ చెత్తను పోసేస్తున్నారు ప్రధానంగా మహాత్మా గాంధీ విగ్రహం పరిసరాలు చుట్టూ ఉదయం అయితే నిత్యం చెత్తతోనే దర్శనమిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య విషయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
