ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణం?

జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణం?

📰 Generate e-Paper Clip

*జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణం?*

 

హైదరాబాద్:ఏప్రిల్ 18

హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది, జూన్ 2 నుంచి ఎంఎంటిఎస్,రైళ్లలో ఉచిత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది, నగరవ్యా ప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురు షులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.

 

జూన్ 2వ తేదీ నుంచి ఈ చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భాగ్య నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు, సామాన్యుడిపై రవాణా భారాన్నితగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకానికి ఆయన ఆమోదం తెలిపారు.

 

తెలంగాణ ఆవిర్భావది నోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయ నున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతా ధికారులతో చర్చలు జరిపారు.

 

ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా, రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!