ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హరిజనవాడలో వీధి కుక్కల దాడి చిన్నారికి తీవ్రంగా గాయాలు

హరిజనవాడలో వీధి కుక్కల దాడి చిన్నారికి తీవ్రంగా గాయాలు

📰 Generate e-Paper Clip

*భయాందోళకం* ! సత్యవేడు హరిజనవాడలో వీధి కుక్కల దాడి చిన్నారికి తీవ్రంగా గాయాలుసత్యవేడు

హరిజనవాడలో 19-04-26వ తేదీన ఆదివారం సాయంత్రం,ఓ 3 ఏళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, వీధి కుక్కలు ఆకస్మికంగా దాడి చేశాయి. కుక్కలు చిన్నారి మీద విరుచుకుపడి శరీరంపై అనేక చోట్ల కరిచాయి. అరుపులు విని స్థానికులు ఏర్పడి కుక్కలను తరిమించారు.

గాయాలతో కుంగిపోయిన చిన్నారిని వెంటనే సమీప సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. డాక్టర్లు తీవ్ర గాయాలు ఉన్నాయని, రేబీస్ టీకాలు ఇవ్వాలని తెలిపారు. కుటుంబీకులు ఈ ఘటనపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారుల నుంచి రక్షణ కోరారుకుంటున్నారుఇటీవల *సత్యవేడు వివిధ ప్రదేశాలలో వీధి కుక్కల దాడులు* ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరగడంతో స్థానికులు భయంలో ఉన్నారు.పంచాయతీ అధికారులు కుక్కలను పట్టి వ్యాక్సినేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!