ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూరపాటి శంకర్ రెడ్డి

జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూరపాటి శంకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూరపాటి శంకర్ రెడ్డి
నాగలాపురం, ఏప్రిల్ 26, (గరుడధాత్రి న్యూస్)
తిరుపతిలో రామ్ తులసి కళ్యాణ మండపంలో అట్టహాసంగా తిరుపతి జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నిర్వహించారు. తిరుపతి జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్ది పాటు జిల్లా వ్యాప్తంగా, సత్యవేడు నియోజకవర్గం నుండి పదవులు పొందిన వారికి సర్వేపల్లి ఎమ్మెల్యే,టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పార్టీ కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ బాబు దిశా నిర్దేశంలో మనమందరం సైనికుల్లా పనిచేసి ప్రజా సమస్యల పై దృష్టి పెట్టి పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయాలని తెలిపారు. అలాగే నియోజకవర్గం నుండి తిరుపతి పార్లమెంటరీ కమిటీలో సత్యవేడు నియోజకవర్గం నుండి మీడియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కందేరీ కార్తిక్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ లుగా కృష్ణయ్య పామంజి వాసు, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎండి కుమార్, స్పోక్స్ పర్సన్ గా లక్ష్మిపతి రాజు , సెక్రటరీగా ఉమామహేశ్వరి ప్రమాణ స్వీకారం చేసిన వీరికి కూరపాటి శంకర్ రెడ్డి అభినందనలు తెలియజేసారు. ఫోటో : ఎన్ జీ పి 02. జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న కూరపాటి శంకర్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!