*బి ఎన్ కండ్రిగలో కూరపాటి శంకర్ రెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…*
*ముఖ్య అతిథులుగా పాల్గొన్న పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే హేమలత..*
కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
బిన్ కండ్రిగ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెంచు రామానాయుడు, నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కూరపాటి శంకర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక తెలుగుదేశంపార్టీని కూరపాటి శంకర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటులో భాగంగా ఈరోజు బుచ్చినాయుడు కండ్రిగలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం శుభపరిణామమని అని అన్నారు.
అనంతరం సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు బుచ్చినాయుడు కండ్రిగ లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఒక వేదికగా మారుతుందని, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
