ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజిల్లా,డివిజన్,మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా,డివిజన్,మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

📰 Generate e-Paper Clip

ఈ నెల 4 వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో పి జీ ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల కార్యాలయంలో తహశీల్దారులు, ఎంపీడీవోలు, ఇతర మండల అధికారులు, ఆర్డీవో కార్యాలయాల్లో రెవిన్యూ డివిజనల్ అధికారి, ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని వినితలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు సంబంధించి ప్రజలు తమ అర్జీలను మండల కార్యాలయాలు లేక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో తమ వినతులను సమర్పించవచ్చని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా అత్యవసరమైతే తప్ప అర్జీదారులు వినతులు సమర్పించడానికి వ్యయ ప్రయాసలకు ఓర్చి జిల్లా కలెక్టరేట్ కు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!