ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటిటిడి కళ్యాణ మండపం పనులు వేగవంతం చేయాలి - ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

టిటిడి కళ్యాణ మండపం పనులు వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

📰 Generate e-Paper Clip

సత్యవేడులో నిర్మాణంలో ఉన్న టిటిడి కళ్యాణ మండపం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ విక్రమ్‌కు నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం సత్యవేడు గంగ జాతర ఆహ్వానం అందించిన జాతర కమిటీ సభ్యులను ఎమ్మెల్యే తన నివాసంలో కలుసుకున్నారు. జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రూ.10 వేల నగదు విరాళాన్ని అందజేశారు.
తదుపరి, మదనంబేడు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ రామచంద్రయ్య కుమారుని వివాహ వేడుకల సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్కడి నుంచి నాగలాపురం చేరుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులను ఆశీర్వదించి, స్థానికులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.
ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ డి. ఇలంగోవన్ రెడ్డి, సత్యవేడు గంగ జాతర కమిటీ అధ్యక్షుడు గోపి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!