ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికోటికి పైగా నిధులుజమ -ప్రగతి సున్నా -చెరివి ప్రాపర్టీ టాక్స్ పై గుసగుసలు..!!

కోటికి పైగా నిధులుజమ -ప్రగతి సున్నా -చెరివి ప్రాపర్టీ టాక్స్ పై గుసగుసలు..!!

📰 Generate e-Paper Clip

పరిశ్రమలు రావడం… అదే వేగంతో ఆస్తి పన్ను కింద  పంచాయతీలకు  భారీగా  నిధులు జమ చేసింది  ఇంకేముంది  ఆ పంచాయతీ లో హైటెక్ వసతులు సమకూరిందని  అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే..! ఇలా నిధులు జమయ్యాయి… కర్పూరం లా  కనిపించకుండా పోయింది   వచ్చిన నిధులతో ఏం పనులు చేశారో అర్థం కాక తలలు పట్టుకుంటోంది సత్యవేడు మండలం  చెరివి  పంచాయతీ. ఈ పంచాయతీ పరిధిలో  నిధుల వ్యయంపై  పలు అనుమానాలు  ఉన్నాయని  అక్కడివాసులు  ఆరోపిస్తున్నారు ఆడిట్ పేరుతో అంతా కాకి లెక్కలు, నిధుల వ్యయం కు  సంబంధించి  సరైన రికార్డులు కూడా లేవని పలువురు అంటున్నారు  ఈ పంచాయతీ పరిధిలో చెరివి, మాదన పాలెం, చిగురుపాలెం గ్రామాలు ఉన్నాయి భారీగా నిధులు వచ్చినప్పటికీ.. పై గ్రామాల్లో కనీస వసతులు మెరుగు పడకపోగా, పంచాయతీ భవనం  కూడా లేకపోగా ప్రతిసారి జరిగే పంచాయతీ సర్వసభ్య సమావేశం, గ్రామ సభలు విధిలేక  పాఠశాల ఆవరణలో నిర్వహించుకోవాల్సిన దుస్థితి నేటికీ ఇక్కడ నెలకొని ఉంది , అద్దె భవనంలోనే సచివాలయం ఇరుకు గదుల్లో, కనీసం సిబ్బంది రికార్డులను భద్రపరచుకోవడానికి కూడా వీలు లేక  అవస్థలు పడుతున్నట్లు  చెరివి పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశలవారీగా జమ
పనులు ఎక్కడ ..?

ఈ పంచాయతీ చుట్టుపక్కల  హీరో మోటార్స్, మెర్క్యూరీ, జిండో విండో ఎక్స్, ఐ ఐ ఈ  తదితర పరిశ్రమలు నెలకొల్పారు వీటి ద్వారా ప్రభుత్వం పంచాయతీ అభివృద్ధిని, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రాపర్టీ టాక్స్( ఆస్తు పన్ను) వసూలు చేసి చెరివి  పంచాయతీ ఖాతాలోకి  జమ చేశారు ( చెక్కుల రూపంలో ) 2022 ఏప్రిల్ మాసం నుంచి 2024  వరకు సుమారు రూ. కోటి 19 లక్షలు ఈ పంచాయతీకి ప్రాపర్టీ టాక్స్ కింద ఏపీఐఐసీ వారు  చెల్లించడం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం దశలవారీగా వచ్చిన నిధులు ఇలా ఉంది..2022  ఏప్రిల్ లో 55 లక్షల 60 వేలు,తదుపరి 2022 అక్టోబర్ నెలలో మరో 20 లక్షల 67 వేలు, తరువాత 20 లక్షల  96 వేలు చొప్పున జమ కాగా 2024 నవంబర్  మాసంలో  21 లక్షల 90 వేలు ఏపీఐఐసీసీ వారు పంచాయతీకి ఇచ్చారు 2026 మే మాసంలో  62లక్షలు  పంచాయతీకి ప్రాపర్టీ టాక్స్ కింద  నిధులు విడుదల చేశారు  చెరివి  పంచాయతీకి సమీపంలోని  ఓ బ్యాంకులో ఉన్న ఖాతాలో చెక్కులు వేసుకుని…. ఇందులో నిధులు డ్రా చేసుకొని ఖాతాలో సున్నా బ్యాలెన్స్ పెట్టడం చర్చనీయాంసమైన విషయం
ఈ కోటి 19 లక్షల  మొత్తంగా వచ్చిన నిధులు… అప్పుడే కర్పూరంలా కరిగిపోయిందని  పంచాయతీ వాసులు లబోదిబోమంటున్నారు

ఐదేళ్లలో  ఎనిమిది మంది బదిలీ

ఏ పంచాయతీలో జరగని విధంగా  చెరివిలో  ఐదేళ్లలో ఎనిమిది మంది కార్యదర్శులు బదిలీ అయ్యారు  ఇలా రావడం.. చెక్కులు రాసుకోవడం, నగదు డ్రా చేసుకోవడం… అమ్మో ఇప్పుడు వద్దు ఇక్కడ అంటూ వెళ్లిపోవడం  కార్యదర్శుల వంతుగా మారింది.

వినతులు దండి – విచారణ మొండి

దాదాపు కోటి 19 లక్షలు  వచ్చిన ఈ పంచాయతీలో  చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని  జరగలేదని అక్కడివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  అక్కడే ఉన్న స్థానికులు కొందరు నిధులు మింగేశారు స్వామి  చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని నెత్తి నోరు మొత్తుకున్నారు.. వినతుల సమర్పించారు…అధికారులు రావడం… ఆ రికార్డు లేవు… ఈ రికార్డులు లేవు… అప్పటి పంచాయతీ కార్యదర్శులు విచారణకు రాలేదంటూ  చేతులెత్తేశారు ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో  పరిశ్రమల నుంచి ప్రాపర్టీ టాక్స్  పంచాయతీకి జమ చేస్తున్నప్పటికీ ఆ నిధులను ఎలా మింగేసారంటూ  పంచాయతీ వాసులు తలలు గోకుంటున్నారు అక్రమాలకు పాల్పడ్డవారే… ఇప్పుడేమో చట్టం న్యాయం… నిధులు రావాలి అంటూ  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని  మండలవాసులు  మండిపడుతున్నారు

పరిశీలించాలి : ప్రత్యేక అధికారి
చెరివి పంచాయతీ పరిధిలో  నిధుల  అక్రమాలు జరిగాయని  జిల్లా ఉన్నతాధికారులకు  లిఖితపూర్వక   ఫిర్యాదులు అందాయి. వాస్తవాలు ఆరా తీసి అక్రమాలు జరిగి ఉంటే కఠిన  చర్యలు తీసుకుంటాం  –  త్రివిక్రమ రావు, ప్రత్యేక అధికారి, చెరివి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!