ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాంట్రాక్టు కార్మికులకు శ్రీవారి దర్శనం ప్రకటించిన టిటిడి బోర్డు కు సిఐటియు అభినందన

కాంట్రాక్టు కార్మికులకు శ్రీవారి దర్శనం ప్రకటించిన టిటిడి బోర్డు కు సిఐటియు అభినందన

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టు కార్మికులకు శ్రీవారి దర్శనం ప్రకటించిన టిటిడి బోర్డు కు సిఐటియు అభినందన

దశాబ్ద కాలానికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు, ఔట్సోర్సింగ్ కార్మికులకు కేటాయించమని కోరుతున్న శ్రీవారి దర్శనం లడ్డు కార్డు గుర్తింపు కార్డులను టీటీడీ బోర్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో అభినందించారు.

టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తమ విన్నపాన్ని మన్నించి ఈ నిర్ణయాలు చేయడం పట్ల ఆయన ఓ ప్రకటనలో హర్షం తెలియజేశారు.

పర్మినెంట్ ఉద్యోగులకు లాగానే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కాంట్రాక్టు కార్మికులకు కూడా కల్పించాలని, వేతనాల పెంపుదలకు అవకాశాలను పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

630 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న 30 కుటుంబాల శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలనికోరారు.

70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్విమ్స్ కార్మికుల వేతనాల పెంపుదల, శానిటేషన్ హోదాను రద్దుపరిచి వార్డు బాయ్ లుగా గుర్తించడం తదితర అంశాలను కూడా నిర్ణయాలు చేస్తారని ఆశాభావంతో ఉన్నామని ఆ సమస్యల పరిష్కారానికి కూడా టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, బోర్డు చైర్మన్ బి.ఆర్ నాయుడులు తోడ్పడాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!