ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి

పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

అకాల వర్షాలకు పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్ధార్థ గ్రామ శివారులో గొర్రెల మేపడానికి వెళ్లిన సందర్భంలో మధ్యాహ్న పిడుగుపాటుకు మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి జనార్ధన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు .
ప్రకృతి విపత్తులకు బలి అయ్యే గొర్రెల కాపరులకు ప్రభుత్వం సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు మాంసాహారాన్ని అందిస్తున్న గొర్రెల కాపరులకు తద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్న ప్రభుత్వం కాపరుల కుటుంబాల్ని విపత్తుల సందర్భంలో ఆదుకునే విధంగా ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని జనార్ధన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!