ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికన్నుల పండుగలా విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం

కన్నుల పండుగలా విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

కన్నుల పండుగలా విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం

చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే గ్రామస్తులు భక్తుల సమక్షంలో వేద పండితులు సిద్ధి బుద్ధి వినాయక స్వాములకు కల్యాణాన్ని శాస్త్ర సంబంధితంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో పలు హోమాధి కార్యక్రమాలతో సింగిరి గుంట దద్దరిల్లింది చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకోవడంతో భక్తజనసంద్రమైంది మేళ తాళాలు మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విజయ వినాయక స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు గ్రామస్తులు భక్తాదులచే ప్రాకారోత్సవం ధ్వజస్తంభ పూజ గణపతి హోమం ఒంటి కార్యక్రమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో సింగిరిగుంట గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!