తప్పెట్ల మోతలు.. మంగళ వాయిద్యాలు.. కేరళ మేళాలు.. భారీ బాణసంచా పేలుళ్లు.. మధ్య సత్యవేడు సదవాలమ్మ గ్రామోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు కొనసాగింది భక్తులు కాయ కర్పూర హారతులతో, జంతుబలులిచ్చి మరికొందరు మొక్కుబడులు తీర్చుకున్నారు ఆహ్లాదకర వాతావరణంలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి చేతులెత్తి ముఖ్య ప్రార్థించడం… సత్యవేడు పట్టణం సుభిక్షంగా… కరువు కాటకాలకు దూరంగా.. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు ఉండాలని పలువురు ప్రార్థించారు అమ్మవారి ఊరేగింపు ఒకపక్క… ఆమె వెనుకే పిండి దీపాల ప్రమిదలతో మహిళలు ఓం శక్తి… అమ్మ గంగమ్మ శక్తి అంటూ భక్తి భావంతో నడిచారు… సరిగ్గా గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అమ్మవారు గంగ మిట్ట ( నడివీధిలో ) వద్ద కొలువుదీరారు… స్థానిక పోలీసులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు… సదవాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గోపీనాథ్ రెడ్డి, సభ్యులు ప్రసాద్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కోదన్ రెడ్డి, విజయ్ నాయుడు తదితరులు ఊరేగింపు కార్యక్రమంలో అన్ని తామై… భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు
