ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్

ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్

📰 Generate e-Paper Clip

ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్

– పుట్టపర్తి జిల్లాలో ఫిఫ్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
– ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరు.
– శత్రు దేశాల రాడార్ సిగ్నళ్లకు దొరకని అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో శక్తి వంతమైన యుద్ధ విమానాల తయారీకి శ్రీకారం.
– ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 15 వేల నుంచి నుండి 20 వేల మందికి ఉపాధి లభించనుంది.
– 2028 నాటికి తొలి యుద్ధ విమానం సిద్ధం.
– డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి.

రాయలసీమ దేశానికే రక్షణ సీమగా మారనుందన్నారు డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ఏరో డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గార్లతో కలిసి పుట్టపర్తి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం వెంకటాపురం మరియు బి.కొత్తపల్లి గ్రామాల సమీపంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్మించనున్న యుద్ధ విమానాల తయారీ కేంద్ర భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ 15 వేల 803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ ఏరోస్పేస్‌ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ ఏరో స్పేస్ ప్రాజెక్టు ద్వారా 7500 మందికిపైగా ఉపాధి లభించనుందన్నారు.
2028 నాటికి తొలి అడ్వాన్స్​డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేసేందుకు కృషి చేస్తున్నామని ఏడాదికి 16 విమానాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ సతీష్ రెడ్డి గారు వివరించారు. ఒక్కో యుద్ధ విమానం తయారీ వ్యయం దాదాపు 900 కోట్ల నుండి 1000 కోట్ల వరకు ఉంటుందన్నారు.
​భవిష్యత్తులో ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు ఈ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని డాక్టర్ సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలకే సాధ్యమైన శత్రు దేశాల అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో శక్తి వంతమైన యుద్ధ విమానాల తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు.
భారత్ సొంతంగా తయారు చేయబోతున్న ఈ యుద్ధ విమానాలు శత్రువుల రాడార్ సిగ్నళ్లకు దొరకకుండా లక్ష్యాలను ఛేదించగలవని ఐదవ తరంతో పాటు ఆరవ తరం ఫైటర్ జెట్ ఫీచర్లను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో గల యుద్ధ విమానం ప్రాజెక్టు ప్రాంగణంలో అసెంబ్లీ ఫెసిలిటీస్, టెస్టింగ్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్స్ మరియు అత్యాధునిక ప్రయోగశాలలను నిర్మించనున్నట్టు డాక్టర్ సతీష్ రెడ్డి గారు వెల్లడించారు. ఇప్పటికే పలు రకంగా సంస్థలకు కేంద్రంగా ఉన్న బెంగళూరుకు చేరువలో ఉండటం వల్ల పుట్టపర్తి ప్రాంతాన్ని ఏరోస్పేస్ హబ్‌గా ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 15 వేల నుండి 20 వేల మందికి ఉపాధి లభించనుందని, దీనికి అనుబంధంగా చుట్టుపక్కల మరో 100 నుండి 300 వరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని డాక్టర్ సతీష్ రెడ్డి గారు వివరించారు. వేల కోట్ల పెట్టుబడితో సాకారమవుతున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటంలో ఒక అంతర్జాతీయ రక్షణ రంగ కేంద్రంగా అభివృద్ధి చెంది భారత రక్షణ రంగానికి వెన్నుముకగా నిలుస్తుందని డాక్టర్ సతీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!