పిచ్చాటూరు మండలం సెన్సస్ హెచ్‌ఎల్‌బి ప్రోగ్రెస్‌లో మూడో స్థానం
పిచ్చాటూరు గరుఢధాత్రి మే 17 :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం సెన్సస్ హెచ్‌ఎల్‌బి ప్రోగ్రెస్ రిపోర్ట్ పనితీరులో జిల్లాలో మూడవ స్థానం సాధించడం పట్ల తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కష్టపడి పనిచేసిన మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి మరియు సహకరించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో పనిచేసి పిచ్చాటూరు మండలాన్ని జిల్లాలో ఎప్పటికప్పుడు ఒకటి నుండి మూడు స్థానాల్లో నిలిపేలా అందరూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
