ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన సత్యవేడు వైసీపీ నాయకులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన సత్యవేడు వైసీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన సత్యవేడు వైసీపీ నాయకులు

గరుడధాత్రి న్యూస్ :

సత్యవేడు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏవీఎం బాలాజీ రెడ్డి, భాస్కర్ నాయుడు, నూకతోటి రాజేష్, బీరేంద్ర వర్మ, కిరణ్ నాయుడు, అపరంజి రాజు, చిన్నదొర తదితర నాయకులు పాల్గొన్నారు.
నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ప్రసాదాలు, పుష్పగుచ్ఛాన్ని అందించి అభివాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!