ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిస్థానిక, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు శుభపరిణామం..

స్థానిక, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు శుభపరిణామం..

📰 Generate e-Paper Clip

స్థానిక, చట్టసభల్లో మహిళలకు
33 శాతం రిజర్వేషన్లు శుభపరిణామం..

టిడిపి రాష్ట్ర మహిళా నేత పుష్పావతి యాదవ్

38,39,40,41 క్లస్టర్ల వర్చువల్ మహానాడు మొదటి రోజు విజయవంతం…

తిరుపతి, మే 27 గరుడధాత్రి:

తెలుగుదేశం పార్టీ మొదటి నాడు మహానాడు సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతిపాదన చేయడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ మహిళా నేత వి పుష్పావతి యాదవ్ చెప్పారు. 11వ క్లస్టర్ ఇన్చార్జి అయిన పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో భాగంగా బుధవారం చెన్నారెడ్డి కాలనీలోని కమ్యూనిటీ హాలులో 38, 39, 40, 41 క్లస్టర్లకు చెందిన టిడిపి వర్చువల్ మహానాడు కార్యక్రమం జరిగింది. మొదటగా టిడిపి జాతీయ జెండాను పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనభాక లక్ష్మీ, నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు పర్వీన్ తాజ్ చేతుల మీదుగా ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న వర్చువల్ మహానాడు ను పరిశీలించి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావడంతో వారంతా పుష్పావతి యాదవ్ ను అభినందించారు. మొదటి రోజు మహానాడు వర్చువల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదటిరోజు సమావేశంలో పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం పై నాయకులు విస్తృతంగా ప్రసంగించారు. వర్చువల్ ప్రసారాల ద్వారా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ప్రసంగాలతో పాటు ముఖ్య నేతల సందేశాలను కమ్యూనిటీ హాల్ నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, పర్వీన్ తాజ్ లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. చెన్నారెడ్డి కాలనీ కమ్యూనిటీ హాలులో నాలుగు కస్టర్లకు సంబంధించి వర్చువల్ టిడిపి మహానాడుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు అవడం పట్ల 11 వ క్లస్టర్ ఇంచార్జ్ పుష్పావతి యాదవ్ ను వారు ప్రత్యేకంగా అభినందించి అక్కడున్న వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నం అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పుష్పవతి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు గతంలో స్వయంగా అక్కడికి వెళ్లి వీక్షించే వారన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆలోచనలతో ప్రతి నగరంలో పట్టణంలో నియోజకవర్గ కేంద్రాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు వీక్షించేలా ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీ జెండాను చూస్తే నమ్మకం భరోసా కలుగుతుందని చెప్పారు. రాజకీయాలలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎప్పటికీ పేదల పక్షాన నిలబడే పార్టీ అని పుష్పావతి యాదవ్ గుర్తు చేశారు. 38 వ క్లస్టర్ ఇంచార్జ్ సంతోష్ కుమార్, యూనిట్ ఇంచార్జ్ సందీప్, కో యూనిట్ ఇంచార్జ్ విశ్వనాధ్, 39వ క్లస్టర్ ఇంచార్జ్ ధర్మారెడ్డి, యూనిట్ ఇన్చార్జి మురుగ, ప్రధాన కార్యదర్శి రాధిక, 40వ క్లస్టర్ ఇంచార్జ్ బాలాజీ, రాజకుమార్, నారాయణ 41వ క్లస్టర్ జయ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి మురళి, యూనిట్ ఇన్చార్జి కెవి రమణ సూర్యకుమారి రాయల్, రేవతి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!