ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలి...

రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలి…

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 29 గరుడధాత్రి :
మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆకాంక్షించారు. శుక్రవారం ఉయ్యూరులో ఉన్న వైవిబి రాజేంద్రప్రసాద్ ను సింగంశెట్టి సుబ్బరామయ్య తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వీటి వల్ల ప్రకటించిన టిడిపి జాతీయ కమిటీల్లో రాజేంద్రప్రసాద్ కు ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజకీయంగా మరింతో ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సింగంశెట్టి సుబ్బరామయ్య మాట్లాడుతూ వై వి బి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గౌరవం లభించిందన్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు ఇప్పించటంలో వైవిపి రాజేంద్రప్రసాద్ ఎంతో కీలకంగా వ్యవహరించారని అలాంటి మహోన్నత వ్యక్తి భవిష్యత్తులో ఆయురారోగ్య సుఖసంతోషాలతో ఉండాలని మనసారా వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు సింగంశెట్టి సుబ్బరామయ్య వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను అందజేయడంతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజేంద్ర ప్రసాద్ ను శాలువతో సత్కరించి భారీ కేకును కట్ చేసి అక్కడున్న వారికి పంచిపెట్టారు. ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రతాప్ రెడ్డి, గోగినేని వసుధ, ముని రెడ్డి, ధనుంజయ యాదవ్, మాజీ సర్పంచులు మాజీ జడ్పిటిసిలు ఎంపిటిసిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!