ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికన్నుల పండువగా నాయి బ్రాహ్మణులచే బంగారు గొడుగు ప్రతిష్టాపన

కన్నుల పండువగా నాయి బ్రాహ్మణులచే బంగారు గొడుగు ప్రతిష్టాపన

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 29 గరుడధాత్రి :
శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి రథంపై నాయి బ్రాహ్మణులచే వంశపార్యపరంగా బంగారు గొడుగు ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. వంశపారంపర్యంగా సాంప్రదాయ బద్ధంగా బంగారు గొడుగు సమర్పిస్తూ వస్తున్న ధర్మకర్త పంతులు రామనాథన్ ఆధ్వర్యంలో బంగారు గొడుగుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ బంగారు గొడుగును నాలుగు మాడా వీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకుని వచ్చి అనంతరం గోవిందరాజ స్వామి వారి రథం అగ్రభాగాన బంగారు గొడుగును ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామ స్మరణలతో ఆలయ మాడవీధుల్లో మారుమ్రోగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి రావు, ఆలయ ఇన్స్పెక్టర్లు రంజన్ కుమార్, ఉమాపతి రెడ్డి , ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ,హర్ష, రాయలసీమ రంగస్థలం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పృద్వి, సుబ్రమణ్యం, చిన్ని మురుగ, గంగమ్మ గుడి మెంబర్ వినుకొండ లక్ష్మణరావు, ఆవులపాటి సంజీవి, తంగవేలు, పలని, కొత్తపల్లి దామోదరం,పెరుమాళ్, పి బాబు,శివాజీ, వినుకొండ మోహన్, నాగరాజు,బాలకృష్ణ,లక్ష్మీపతి, యువరాజ్, కందుకూరి ప్రసాద్, సీతారామయ్య, కర్ణ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!