ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివడదెబ్బకు గురై వ్యక్తి మృతి

వడదెబ్బకు గురై వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : మండలంలోని కీలపూడి గ్రామానికి చెందిన వెంకటస్వామి కుమారుడు పేరయ్య (55) వడదెబ్బకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శనివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేరయ్య అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పేరయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేసవి కాలంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తగినంత నీరు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!