ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కూరపాటి శంకర్ రెడ్డి...

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కూరపాటి శంకర్ రెడ్డి…

📰 Generate e-Paper Clip

సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు ఆపత్కాలంలో తాను ఉన్నానంటూ అండగా నిలుస్తు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గానికి చెందిన 11 మంది అత్యవసర పరిస్థితుల్లో శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన చెక్కులను అందజేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో సత్యవేడు నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా తమ వంతు బాధ్యతగా సాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా కేవీబీపురం,నాగలాపురం పిచ్చాటూరు, వరదయ్యపాలెం, బిన్ కండ్రిగ మండలాలకు చెందిన 11 మందికి 6లక్షల 85వేల 288 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కూరపాటి శంకర్ రెడ్డి.
*లబ్ధిదారుల వివరాలు*

*వరదయ్యపాలెం మండలం👇*
చెన్నవరం సాయి, సిఎల్ఎన్ పల్లి – 27,341/-

D మంజుల,సిఎల్ఎన్ పల్లి – 23,100/-

C పుష్ప, చిన్నపాండురు – 22,114/-

V ప్రభుదాస్, మత్తేరి మిట్ట – 56,851/-

*బిన్ కండ్రిగ మండలం👇*
M చంద్రయ్య, కారణి – 23,889/-

వేమసాని రత్నమ్మ, వెస్ట్ వరత్తూరు – 2,52,828/-

బొగ్గల కృష్ణయ్య, తలారివెట్టు -57,522/-

*నాగలాపురం మండలం👇*
B తులసిరామ్, నాగలాపురం – 48,765/-

K శంకర్, నాగలాపురం – 37,878/-

*పిచ్చటూరు మండలం👇*
K తులసిరామ్, కీలపూడి – 35000/-

*కేవీబీపురం మండలం👇*
P జయదనుష్, కోటమంగాపురం – 1,00,00/-

ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!