-సకాలంలో వైద్యుల స్పందన తో కోలుకున్న బాధితులు
-ఊపిరిపీల్చుకొన్న గ్రామస్థులు
బైరెడ్డిపల్లి జూన్01 గరుడధాత్రి :
బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేట గ్రామoలో గంగమ్మ జాతరకు గురువారం గ్రామస్తులు శ్రీకారం చుట్టారు.ఈ నేపధ్యంలో స్థానిక గ్రామానికి చెందిన మహిళ తమిళనాడు నుండి తెచ్చిన అరేంజ్ కలర్ (రసన)లిక్విడ్ వినియోగించి జ్యుస్ తయారీ చేసింది. ఈ జ్యుస్ ను ఆలయం వద్దకు విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు.జ్యుస్ త్రాగిన చిన్నారులకు,పెద్దలకు,గర్భిణీ స్త్రీలకు సుమారు 70 మంది అస్వస్థతకు గురైనారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారీ విజయ్ చందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని,బాధితులకు
సకాలంలో చికిత్స అందివ్వడంతో బాధితులు త్వరితగతిన కొలుకొన్నారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
