తిరుపతి జూన్ 1 గరుడధాత్రి : విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని సాయి సుధా ప్లే స్కూల్ ఏపీ క్యాంపస్ ను సోమవారం స్కూల్ ఎండి డాక్టర్ రేఖ రాళ్లపల్లి యు.ఎస్. ఏ, గుడివాడ వెంకట రామానాయుడు, అధ్యక్షులు రామ్ సాఫ్ట్వేర్ సిస్టం ఐ .ఎన్. సి. యూఎస్ఏ, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి ఎండి యు .ఎస్. ఏ, డాక్టర్ బద్దెల సుకుమార్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, మాస్టర్ అభిషేక్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అభ్యసించడం ఎంతో అవసర న్నారు. గ్రామీణ ప్రాంతంలో కూడా నగరాలకు ఏమాత్రం తీసుకొని విద్యా ప్రమాణాలు అందుబాటులోకి రావడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యా ప్రమాణాలు అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని లక్ష్యంతో యుద్ధ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన విద్య సృజనాత్మక కు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ నందు విశిష్ట గుర్తింపు పొందాయని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే విధంగా ప్రత్యేక బోధన కార్యక్రమాలు గ్రేటర్ సాంస్కృతిక కార్యక్రమాలు తోపాటు వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించడమే లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అత్యుత్తమ విద్యా వాతాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ ఇన్చార్జి భార్గవి, రేవతి మాట్లాడుతూ విద్యార్థుల మేధో వికాసం పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనుభవిగ్గులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక తరగతి గదులు స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ విద్య అభివృద్ధికి ఒక కేంద్రంగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, పుష్ప, భార్గవి, ఆసిఫా, శకుంతల, శారద, సుజాత, మహేశ్వరి, ధనలక్ష్మి దాక్షాయని, కిరణ్, మున్వర్ భాష, వెంకట ముని, విద్యార్థులు పాల్గొన్నారు.
