ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికొల్లన్ మృతికి రాజేష్ ఘన నివాళి

కొల్లన్ మృతికి రాజేష్ ఘన నివాళి

📰 Generate e-Paper Clip

-కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త

నాగలాపురం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ సభ్యుడు దేశప్పన్ తండ్రి కొల్లన్ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరమపదించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గురువారం నాగలాపురం వెస్ట్ హరిజనవాడకు చేరుకుని కొల్లన్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం దేశప్పన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేష్, వారి దుఃఖాన్ని పంచుకుని ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. కొల్లన్ మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!