తిరుపతి, జూన్ 4 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన రాంప్రసాద్, జిల్లా సర్వే మరియు భూ రికార్డుల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్‌కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
