నాగలాపురం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి వాడలో జరిగిన శ్రీ మాతమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యుడు కె. వెంకటేష్ మేఘల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం రూ.5,000లను విరాళంగా అందజేశారు.
అనంతరం అరుంధతి వాడ గ్రామస్తులు ఆలయ సంప్రదాయాల ప్రకారం కె. వెంకటేష్ మేఘల గారిని ఘనంగా సత్కరించి ఆలయ మర్యాదలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎండి కుమార్, చాంద్ బాషా, పాలిశ్వరన్, వెంకటేష్, రఘు యాదవ్‌తో పాటు అరుంధతి వాడ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు.
