గరుడధాత్రి :
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ హెలీపాడ్ కు మంగళవారం ఉదయం 11. 15 గంటలకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్.
రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అపూర్వ స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి.
రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు నగర మేయర్ సుజాత, విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. సునీత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు
