ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌

వైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌

📰 Generate e-Paper Clip

వైభవ్‌పై కపిల్‌ ప్రశంసల జల్లు
అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన
కేవలం ఆటపైనే ఫోకస్‌ చేయాలని వైభవ్‌కు సూచన
ఐపీఎల్‌ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
భారత క్రికెట్ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. అతడు చాలా అద్భుతమైన ప్రతిభావంతుడని కొనియాడాడు. అయితే ఇంత చిన్న వయసులోనే అతనిపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురావద్దని సూచించాడు.

వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, చిన్న వయసులోనే క్లబ్ క్రికెట్‌లో అతను ఆడిన తీరు అతని అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించిందని కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం అతను ఎక్స్‌ట్రా విషయాల జోలికి వెళ్లకుండా కేవలం తన ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ సమయంలో అతనిపై మనమందరం మోయలేనంత ఒత్తిడి పెంచుతున్నామని ఆందోళన వ్యక్తం చేశాడు.

సెలెక్షన్ ప్రక్రియపై ఐపీఎల్ ప్రభావం గురించి 1983 ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత కీలకమైన టోర్నమెంట్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు నిరంతరం గమనిస్తున్నారని, సరైన స్థానంలో సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేయడానికి సెలెక్టర్లకు ఇప్పుడు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని చెప్పాడు.

ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే ఈ ఎడమచేతి వాటం ఓపెనర్ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు 2026 కోసం సెలెక్టర్లు అతనికి చోటు కల్పించారు. దీంతో భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!