నారాయణవనం, జూన్ 11 గరుడధాత్రి : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ నారాయణవనం మండలంలోని పలు శుభకార్యాల్లో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.
మండలంలోని భీమునిచెరువు గ్రామానికి చెందిన దొంగేలి మణి కుమారుడు దొంగేలి నవీన్ వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కోనేటి సుమన్ కుమార్ నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కసిమిట్ట గ్రామానికి చెందిన కుట్టి గోవిందస్వామి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
తదుపరి కసిమిట్ట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని కుమారుడు సురేష్‌కు ధైర్యం చెప్పి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అలాగే జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ కూడా నవీన్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
