ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ప్రజలకు మెరుగైన సేవలు

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ప్రజలకు మెరుగైన సేవలు

📰 Generate e-Paper Clip

– వైద్య పరీక్షలు చేయించుకున్న జడ్పిటిసి కోనేటి సుమన్
– ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి 5 వేలు రూపాయలు అందించిన కోనేటి సుమన్

నారాయణవనం జూన్ 11 (గరుడదాత్రి న్యూస్) ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ దర్శిత్ రాజ్, జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ కు బిపి, టెంపరేచర్ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 50% కోలుకున్నారని పూర్తిగా కోల్పోవడానికి సంపూర్ణ విశ్రాంతి అవసరమని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, ఓ ఆర్ ఎస్, వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి 5వేల రూపాయలు విరాళం డాక్టర్ దర్శిత్ రాజ్, డాక్టర్ రాఘసుధా లకు అందజేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన బెడ్ షీట్స్, పిల్లోస్ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం తన వంతుగా సొంత ఖర్చులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనికి అవసరమైన వాటిని తీసిస్తానని హామీ ఇచ్చారు. మండల ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకరించిన జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ కి డాక్టర్ దర్శిత్ రాజ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మహేష్ గుజ్జేలి, బాలమురుగన్, మహేష్ బాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!