ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

📰 Generate e-Paper Clip

తిరుపతి క్రైమ్,జూన్ 11, న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు నేడు(12-06-2026) తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, సౌకర్యం మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడనున్నవి.
ప్రజలు, ప్రయాణికులు మరియు వాహనదారులు క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసు శాఖకు సహకరించవలసిందిగా కోరడమైనది.
– *చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.
ఒమేగా హాస్పిటల్ – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – లీలామహల్ – కరకంబాడి మార్గం ద్వారా ప్రయాణించవలెను.
– *మదనపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు.
పీలేరు – రంగంపేట – శ్రీనివాస మంగాపురం – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – ఫ్లైఓవర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలెను.
– *ఆర్టీసీ బస్టాండ్ నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు
ఫ్లైఓవర్ – నంది సర్కిల్ – గరుడ సర్కిల్ – జూపార్క్ – చెర్లోపల్లి – ఒమేగా హాస్పిటల్ మార్గం ద్వారా ప్రయాణించవలెను.
– *కడప వైపు నుండి వచ్చే వాహనాలు.*
కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ మార్గం ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలెను.
– *నెల్లూరు, నాయుడుపేట వైపు నుండి వచ్చే వాహనాలు.
వాజ్‌పేయి జంక్షన్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – రమణ విలాస్ సర్కిల్ – కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ – ఆర్టీసీ బస్టాండ్ మార్గం ద్వారా ప్రయాణించవలెను.
– *చెన్నై, పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.
గాజులమండ్యం సర్కిల్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – నారాయణాద్రి హాస్పిటల్ – బ్లిస్ సర్కిల్ మార్గం ద్వారా తిరుపతి నగరంలోకి ప్రవేశించవలెను.
– ప్రజలకు విజ్ఞప్తి
వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి.
ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
ప్రజల సౌకర్యార్థం అమలు చేస్తున్న ఈ ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించి కార్యక్రమం విజయవంతానికి తోడ్పడాలి.
అత్యవసర సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మరియు ఇతర అత్యవసర సేవల వాహనాలకు పై ట్రాఫిక్ మళ్లింపులు వర్తించవు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!