ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. -బూత్ ఇన్చార్జిలా నియామకంపై కోనేటి సుమన్ దృష్టి...

పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. -బూత్ ఇన్చార్జిలా నియామకంపై కోనేటి సుమన్ దృష్టి…

📰 Generate e-Paper Clip

-మండల వారిగా సమావేశాలు..??
గరుడధాత్రి ✍️
పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలకు ఎక్కడ తూట్లు పడకుండా చూడడమే లక్ష్యంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు, నారాయణ మనం జెడ్పిటిసి సభ్యుడు కోనేటి సుమన్ అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా బూత్ లెవల్ ఇన్చార్జిల నియామకం కు సంబంధించి కోనేటి సుమన్ కు టిడిపి అధిష్టానం ప్రత్యేక బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నియోజవర్గ పరిధిలోని 279 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నియోజవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో రెండు లక్షల పదహారువేల మంది ఓటర్లు ఉన్నారు ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి టిడిపి తరఫున బూత్ ఇన్చార్జిలను నియమించే ప్రక్రియ పూర్తిగా కోనేటి సుమన్ కు అధిష్టానం అనూహ్యంగా అప్పగించింది నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో స్థానిక నాయకత్వం అభిప్రాయాలు, సూచనలు సలహాలతో బూత్ ఇన్చార్జిల నియామకం చేసేందుకు సుమన్ అప్పుడే ప్రక్రియ మొదలు పెట్టారని సమాచారం ఒకటి రెండు మండలాల్లో ఎక్కువగా వైసిపి మద్దతుదారులకే కొన్ని విషయాల్లో న్యాయం జరిగిందనే ఆవేదన టిడిపి వర్గాల్లో తారస్థాయిలో వినిపిస్తోంది అటువంటి అవకాశాలు ఈ బూత్ ఇన్చార్జిలా నియామకంలో జరగకుండా ఉండేందుకు క్షేత్ర స్థాయి నుంచి ఇన్ పుట్ తీసుకునే ప్రక్రియ కూడా మొదలైందని అధికార పార్టీ వర్గాల్లో సమాచారం ఉంది తనకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరికి ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలో తనకు బాగా తెలుసునని, బూత్ ఇన్చార్జిల నియామకం కూడా అంత సులువైన పని కాదని, అన్ని కోణాల్లో ఆలోచించి నియామకం ఉంటుందని కూడా ఇప్పటికే సుమన్ చెప్పుకుంటూ వస్తున్నారు మరో మూడు రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమన్ పర్యటిస్తారని కూడా సమాచారం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!