తిరుపతి, జూలై 21 గరుడధాత్రి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 22-ఏ భూములు, వెబ్‌ల్యాండ్, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, రీ-సర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఫారెస్ట్ ల్యాండ్స్, గృహ వసతి, ఐవీఆర్ఎస్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా అంశాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని సీసీఎల్ఏ జి. జయలక్ష్మి దిశానిర్దేశం చేశారు.
తిరుపతి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్, ల్యాండ్ అండ్ సర్వే అధికారి రాంప్రసాద్, సెక్షన్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
